Movie Paid Premiers: ఇక్కడ కొంప ముంచాయి… అక్కడ లేపాయి

పెయిడ్ ప్రీమియర్స్ అనే విధానం ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అయితే సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనే గానీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. ఇక తాజాగా పెయిడ్ ప్రీమియర్స్ వల్ల “గుంటూరు కారం” మూవీకి జరిగిన నష్టం తెలిస్తే పెయిడ్ ప్రీమియర్సా? ఇక నుంచి ఆలోచించాల్సిందే అని అనిపించక మానదు. ఈసారి సంక్రాంతికి వేసిన పెయిడ్ ప్రీమియర్స్ ఇక్కడ కొంపముంచాయి, అక్కడ మాత్రం లేపాయి. మరి పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఎవరి కొంప మునిగింది? ఎవరికి బెనిఫిట్ కలిగింది? అనే వివరాల్లోకి వెళితే…

ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీ గురించి మాట్లాడుకోవాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ఇక నిర్మాతలు “గుంటూరు కారం” మూవీ ప్రీమియర్స్ విషయంలో కాస్త తొందరపడ్డారని అనిపిస్తుంది. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాగా, అదే రోజు మిడ్ నైట్ కంటెంట్ పై నమ్మకం ఉన్న మేకర్స్ 1AM, 4PM పెయిడ్ ప్రీమియర్స్ వేసి క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు. కానీ అక్కడే పెద్ద దెబ్బ పడింది “గుంటూరు కారం”పై. నిజానికి పెయిడ్ ప్రీమియర్స్ అంటే ముందుకు వచ్చేది అభిమానులు మాత్రమే. సాధారణంగా 500 ఉండే టికెట్ రేట్లు పెయిడ్ ప్రీమియర్స్ కి 2000 కంటే ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి సాధారణ ప్రేక్షకులు పెయిడ్ ప్రీమియర్స్ చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించరు. అలా “గుంటూరు కారం” మూవీకి కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేయగా టికెట్ రేట్లు 2000 నుంచి 5000 వరకు అమ్మారు. మరి ఒక్క టికెట్ ను ఇంత హై రేటుకు అమ్ముతున్నారు అంటే ఎంత అభిమానులు అయినప్పటికీ అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి కదా. అలా టికెట్ కు తగ్గ అంచనాలు పెట్టుకుని థియేటర్లలోకి అడుగు పెట్టిన మహేష్ అభిమానులను “గుంటూరు కారం” నిరాశపరిచింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గ కంటెంట్ సినిమాలో కనిపించకపోవడంతో 1AM షోల నుంచే స్వయంగా మహేష్ అభిమానుల నుంచే నెగెటివిటీ ఎదురయింది. అలా పెయిడ్ ప్రీమియర్స్ వల్ల సినిమాకు మొదటి రోజు మొదటి షో నుంచే నెగెటివ్ దెబ్బ పడింది.

మరోవైపు “హనుమాన్” మూవీకి మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ మేలు చేశాయి. “గుంటూరు కారం”తో గట్టి పోటీ, థియేటర్ల సమస్యతో “హనుమాన్” మూవీపై సింపతి ఏర్పడింది. అలాగే ట్రైలర్ తో ఈ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. సినిమా రిలీజ్ కంటే ఒక రోజు ముందే అంటే ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి రాగా, జనవరి 11న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అయితే అప్పటిదాకా యావరేజ్ కంటెంట్ అంటూ ప్రచారం జరిగిన “హనుమాన్”కు ఎవరూ ఊహించని విధంగా పెయిడ్ ప్రీమియర్స్ వల్ల మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కు అద్భుతమైన పాజిటివ్ రివ్యూలు, రావడంతో ఈ మూవీని బాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ బాగానే లేపాయి. దీంతో “హనుమాన్” కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. ఈ రెండు సినిమాలను ఉదాహరణగా తీసుకుని ఇకపై పెయిడ్ ప్రీమియర్స్ వేయాలి అనుకునే మేకర్స్ ఖచ్చితంగా మరోసారి ఆలోచించుకోవాల్సిందే.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు