Geetha arts: భారీ రిస్క్ లో నాగ చైతన్య కొత్త సినిమా

Geetha arts

గతేడాది కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఒక భారీ రిస్క్ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తోన్నాయి.

అయితే నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు తండేలు అనే పేరు ను కన్ఫామ్ చేసారు మూవీ యూనిట్. గుజరాత్ లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇక ఈ సినిమా యొక్క బడ్జెట్ ను ఇటీవలనే మేకర్స్ ఫైనల్ చేసారని వార్త వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకోసం గాను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అక్షరాల 60 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే నిజానికి నాగ చైతన్య సినిమా కోసం 60 కోట్లు పెట్టేంత మార్కెట్ లేదు. కానీ అల్లు అరవింద్ మాత్రం చందు మొండేటి చెప్పిన కథ ను బలంగా నమ్మడంతో అంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యాడట. అంతేకాదు ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ స్కెల్ లో తీయబోతున్నారట.

- Advertisement -

అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా భారీగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. అయితే ఇది నిజంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవలనే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా విషయంలోను ఇలాగే జరిగింది. కథను నమ్ముకొని బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పిన ఏజెంట్ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఆ సినిమా ఫ్లాప్ అవడంతో భారీ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. మళ్ళీ అదే రిస్క్ నాగ చైతన్య సినిమా కూడా ఫెస్ చేయబోతుందని తెలుస్తుంది. నిజంగానే సినిమాలో విషయముంటే పరవాలేదు కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం అల్లు అరవింద్ భారీగా నష్టపోవాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు