Nayanthara: నన్ను కొందరు కమిట్మెంట్ అడిగారు

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి విజయశాంతి లాగా ఆమె తెలుగు, తమిళ భాషలలో లేడీ సూపర్ స్టార్ గా స్టార్డం ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది నయనతార.

గతేడాది దర్శకుడు విగ్నేష్ శివన్ ను నయనతార ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె కెరీర్ పరంగా ఎంత పాపులర్ అయిందో తన పర్సనల్ లైఫ్ విషయం కూడా ఎప్పటికప్పుడు అంతే హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ఇటీవల సరోగసి విషయంలో వార్తల్లో నిలిచిన నయనతార తాజాగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, ఇతర మహిళా నటులు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై నయనతార మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది, లేదు అనే విషయం గురించి తాను మాట్లాడనని తెలిపింది. కానీ మన ప్రవర్తనను బట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది.

- Advertisement -

నయనతార ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారని.. అయితే తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పానని వెల్లడించింది. తాను కేవలం తన టాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పింది. తన టాలెంట్ తోనే ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ గురించి నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు