NBK109 Movie: మళ్లీ ఫ్లాష్ బ్యాక్… అయితే ఈ సారి అంతకు మించి?

నందమూరి నటసింహం బాలయ్య నుంచి ఇటీవల వచ్చిన సినిమలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి మూవీ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్యకు హ్యాట్రిక్ హిట్‌ని ఇచ్చింది. ఇప్పుడు సంక్రాంతి టైంలో మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీతో బాలకృష్ణ సినిమా చేయబోతున్నాడు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. బాలకృష్ణ నటించే ప్రతి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉండటం చాలా కామన్. ఇంటర్వెల్ వరకు కథ వచ్చి, ఇంటర్వెల్ టైంలో ఓ ట్విస్ట్ ఇచ్చి.. వెంటనే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరీ మూవీ వరకు బాలయ్య సినిమాల్లో ఇదే కనిపించింది.

ఇప్పుడు బాబీతో వచ్చే మూవీలో కూడా ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కీలకంగా ఉంటుందని సమాచారం. అయితే ఇప్పుడు కాస్త హై డోస్ తో ఫ్లాస్ బ్యాక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. అందులో రెండు పాత్రలు ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించనవే అని తెలుస్తుంది. డైరెక్టర్ బాబీ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక చోరువ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బాలయ్య సినిమాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ NBK109లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

కొంత వరకు లవ్ స్టోరీ తో పాటు బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకునే ఊర మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ సీన్స్ ను కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాబీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ స్క్రీన్ పై వస్తున్నంత సేపు బాలయ్య అభిమానులు రచ్చ మామూలుగా ఉండదట. ముఖ్యంగా ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను బాలయ్య ఫ్యాన్స్ కోసమే ఓ రేంజ్ లో డిజైన్ చేస్తున్నట్టు టాక్ వస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం మీనాక్షీ చౌదరీని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా, సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిష నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు