Sandeep Reddy Vanga ; “స్పిరిట్” అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్… ఈమాత్రం చాలు సామీ

డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ఫుల్ యాక్షన్ మూడ్ లో ఉన్నాడు. తన తాజా చిత్రం “యానిమల్”తో డిసెంబర్ 1న బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న “యానిమల్” మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇప్పటికే ‘యానిమల్’ టీం రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు ఊహించినట్టుగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత సందీప్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. 2001లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. “స్పిరిట్” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా “యానిమల్” మూవీ ప్రమోషన్స్ లో సందీప్ “స్పిరిట్” మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

“యానిమల్” మూవీ విడుదలైన వెంటనే ప్రభాస్ “స్పిరిట్” వర్క్ స్టార్ట్ చేస్తానని, 2024 సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ ను కూడా ‘యానిమల్’ లాంటి మోస్ట్ వయోలెంట్ రోల్ లో చూడాలని డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అందుకే వీరి కాంబోలో రాబోతున్న “స్పిరిట్” మూవీ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ఇక మరోవైపు ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “సలార్” డిసెంబర్లోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. త్వరలోనే “సలార్” మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ‘కేజీఎఫ్” లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో “సలార్” మూవీపై పెరిగిన హైప్ గ్రాఫ్ ఆకాశంలో ఉంది. డిసెంబర్ 22న “సలార్” మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే మోకాలు సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. మరి “సలార్” మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. సలార్ మూవీలో శృతి హాసన్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనుంది. ప్రభాస్ కు ఈ మూవీ హిట్ కావడం చాలా ముఖ్యం. మరి ‘సలార్’ అంచనాలను అందుకుంటుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ చివరి వారం దాకా వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు