Tiger Shroff: ష్రాఫ్ ఎఫైర్స్ లిస్ట్ పెద్దదే.. ప్రభాస్ బ్యూటీస్ కూడా..!

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని బడే మియా చోటే మియా అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ తో పాటూ అక్షయ్ కుమార్ కూడా కలిసి నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా రంజాన్ కు విడుదల కానుండగా మరొకవైపు టైగర్ ష్రాఫ్ చేతిలో భాఘీ 4 కూడా ఉంది.. ఇకపోతే తాజాగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లో రానుండగా ఈ విషయాన్ని ముంబై లో జరిగిన అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు చిత్ర బృందం.. తాజాగా ఈ వేదికపై టైగర్ ష్రాఫ్ పై జోకులు పేల్చారు హీరో వరుణ్ ధావన్..

టైగర్ ష్రాఫ్ పై వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్..

ఈ వేడుకపై ముందుగా యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితోనూ మాట్లాడను.. కలిసిపోనని కూడా నీకు తెలుసుగా వరుణ్.. అందరితో కలివిడిగా ఉండలేను.. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ చెప్పారు టైగర్ ష్రాఫ్.. దీనికి వరుణ్ స్పందిస్తూ.. అవునా.. నిజంగానా.. 25 ఏళ్ల వరకు నీకు ప్రియురాలే లేదా ? అంటూ ఆశ్చర్యపోయాడు..! అవును నాకు 25 యేళ్లు నిండాక తెలుగు సినిమా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు మొదటిసారి ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చారు టైగర్ ష్రాఫ్.. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్ నే కదా.. మొదటిసారి ప్రేమించింది ఆమెనేనా? అని అడిగాడు వరుణ్ ధావన్.. అయితే ఆమె పేరు చెప్పగానే షాక్ అయిన టైగర్ ష్రాఫ్.. కాదు ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్ సరే నేను సరదాగా అన్నాను.. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే..ఎవరు దీనిని సీరియస్గా తీసుకోకండి అని చెప్పారు..

- Advertisement -

దిశా పఠానీ తో డేటింగ్ , బ్రేకప్..

ఇకపోతే గతంలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు అనే రూమర్స్ కూడా వచ్చాయి.. కానీ ఇటీవల ఒక ఈవెంట్లో ఒకరికొకరు ఆత్మీయంగా హత్తుకొని కనిపించారు.. కానీ ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం నిరాకరించారు టైగర్ ష్రాఫ్. ఇకపోతే వీరిద్దరూ ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

ప్రభాస్ బ్యూటీస్..

ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది . రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చెప్పవచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు