Mouni Roy: డబ్బులు ఇస్తే డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌తో అలా చేస్తుందా ?

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. నాగిని డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్ తో సందడి చేసింది. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ మౌని రాయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెట్టింది. ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ కోర్స్ మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలని ముంబై వచ్చిన మౌని రాయ్.. 2004లో వచ్చిన రన్ మూవీలో ఓ సాంగ్ లో డాన్సర్ గా వెండితెరపై మెరిసింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో కీలక పాత్రలలో నటించింది. ఇక గతేడాది విడుదలైన బ్రహ్మాస్త్రం సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. బ్రహ్మాస్త్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది. అలాగే గతేడాది తన ప్రియుడు సూరజ్ నంబియార్ ను వివాహమాడింది.

పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి అందాల ఆడబోత తగ్గలేదు. నిత్యం సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటో షూట్లకు కుర్రాళ్ళు షేక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసే ట్వీట్స్ ఎప్పుడూ వివాదాస్పదమవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఆయన టాలీవుడ్ ని కూడా టార్గెట్ చేసి ట్వీట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓ ఉమనైజర్ అని, విజయ్ దేవరకొండ – సమంత మధ్య, మహేష్ బాబు – పూజా హెగ్డే మధ్య ఏదో ఉందని ట్వీట్స్ చేసి వివాదాస్పదంగా మారారు. అలాగే సమంత – నాగ చైతన్య, ధనుష్ – ఐశ్వర్య డైవర్స్ అంశాలపై కూడా ఈయన చేసిన ట్వీట్స్ పెద్ద దూమరాన్నే లేపాయి.

- Advertisement -

తాజాగా ఉమైర్.. మౌని రాయ్ పై చాలా ఘాటు ఆరోపణలు చేశాడు. “మౌని రాయ్ కి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో ఎన్నో సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయి. డబ్బు కోసం ఆమె ఏదైనా చేస్తుంది” అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని బాలీవుడ్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరి ఉమైర్ చేసిన ఈ ఆరోపణలపై మౌనీ రాయ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు