Milk Beauty: తమన్నాలో ఈ మార్పు చూశారా.. ఇది దేనికి సంకేతం..?

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ తమన్నా గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది తమన్నా. అందం, అభినయం కలబోతగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అటు గ్లామర్ పాత్రలు, ఇటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తూ కెరీర్ గ్రాఫ్ ని ముందుకు తీసుకు వెళుతుంది.

అయితే ఏ హీరోయిన్ కి అయినా అందం, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందంగా, ఫిట్ గా ఉన్న వాళ్లకే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. వారికి వయసుతో కూడా సంబంధం ఉండదు. తమన్నా తన కెరీర్ ప్రారంభంలో కూడా నాజూకు అందంతో యువతను కట్టిపడేసింది. ఇప్పుడు 30+ లోకి ఎంటర్ కావడంతో ఆమె శరీరం మాట వినడం లేదనుకుంటా. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ మిల్కీ బ్యూటీ వయ్యారం వొలకబోసింది.

ర్యాంప్ వాక్ చేసి చూపరులను ఆకట్టుకుంది. అయితే ఈ ర్యాంప్ వాక్ లో తమన్నా బరువు పెరిగినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. గతంతో పోల్చితే తమన్నాలో ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసిన చాలామంది నెటిజెన్లు సైతం లావయ్యారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి స్లిమ్ నెస్ ఆమెలో లేదంటున్నారు. కొందరు ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని సలహా ఇస్తుంటే.. ఇక మరికొందరు మాత్రం తమన్నా పనైపోయిందని, ఇక ఆమె కెరీర్ ముగిసినట్టేనని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మరి ఈ విషయాన్ని గ్రహించి తమన్న ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకుంటుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక తమన్నా  ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “జైలర్” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా “భోళా శంకర్” సినిమాలో నటిస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు