PAPA, Kabza: ఈ వారం బాక్సాఫీస్ విన్నర్ ఎవరు ?

ఈ వీకెండ్ ప్రేక్షకులను అలరించడానికి వరసగా నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 17న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జా, షాజామ్ – ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్, ఘనా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంలో నాగ శౌర్య హీరో గా, హీరోయిన్ గా మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమా ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ స్టోరీ టీనేజ్ నుండి అడల్ట్ లైఫ్ వరకు జరిగిన ప్రేమ కథ గురించి ఉండబోతుందని ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్‌తో తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కి సెన్సార్ రిపోర్ట్ U/A వచ్చింది. అలాగే సినిమా నిడివి 2 : 09 గంటల ఉండబోతుంది.

అదే రోజున ఉపేంద్ర హీరోగా నటిస్తున్న కబ్జా మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ లో రాబోతుంది. దీనిలో సుధీర్, శివ రాజాకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక పిరియాడికల్ యాక్షన్ మూవీ. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఇండియా లో బ్రిటిష్ రూల్ చేసిన టైం గురించని మూవీ మేకర్స్ చెప్పారు. ఈ సినిమా పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కి సెన్సార్ రిపోర్ట్ U/A వచ్చింది. సినిమా నిడివి 2 : 16 గంటలు ఉంది.

- Advertisement -

షాజామ్ – ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా ఆ రోజే రిలీజ్ కాబోతుంది. ఇది సూపర్ హీరోస్ కి సంభందించిన సినిమా. ఇంగ్లీష్ లో మంచి రివ్యూస్ ఉన్న ఈ సినిమా ని తెలుగు ప్రేక్షకులకి నచ్చుతాదో లేదో చూడాలి. దీనికి సెన్సార్ రిపోర్ట్ U/A ఉండగా, నిడివి 2 : 10 గంటలు ఉంది.

ఈ వారం ఘనా అనే చిన్న బడ్జెట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంది. ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ U/A వచ్చింది. సినిమా నిడివి 1 : 48 గంటలుగా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మొత్తానికి ఈ వీకెండ్ అయితే ప్రేక్షకులకు ఎవరు బోర్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ ఉన్నాయి. ఇందులో ఉపేంద్ర నటిస్తున్న కబ్జా, నాగ శౌర్య – మాళవిక నాయర్ కలిసి చేస్తున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలపై అందరి దృష్టి ఉందని చెప్పొచ్చు. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద జరుగుతన్న పోరులో ఏ సినిమా విజయం సాధింస్తుందో చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు