Adhipurush : క్రేజీ డీల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘బాహుబలి’ తో ప్రభాస్ క్రేజ్ ఖండంతరాలు దాటింది. ప్రభాస్ తో సినిమాతో తెరకెక్కించాలని వందల కోట్లలో బడ్జెట్ ను లెక్కలు వేసుకొని మరి దర్శక నిర్మాతలు వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ వందల కోట్లలో బిజినెస్ లు చేస్తున్నాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కూడా భారీ బిజినెస్ లు జరిగినవే. ఈ రెండు బాక్సఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినా ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్తానికి భూషణ్ కుమార్, ఓంరౌత్ లు నిర్మాణం వహిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా 3డీ లో ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటికి వచ్చింది.

ఈ భారీ చిత్రానికి ఓటీటీ కోసం భాటీ డీల్ కంప్లీట్ అయినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. 250 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లుగా వస్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు