Gargi : ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీ

టాలీవుడ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ లలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారు. ఈ హైబ్రిడ్ పిల్లకు ఉన్న ఫాలోయింగ్ ను చూసి లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు. సాయి పల్లవి ఇటీవల విరాట పర్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ ఫలితాన్ని పక్కన పెడితే, విరాట పర్వం మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక వెన్నెల పాత్రకు అయితే సాయి పల్లవి వందకు వంద శాతం న్యాయం చేసింది. ఈ సినిమా తర్వాత గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది సాయి పల్లవి. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని నమోదు చేయలేదు. కానీ, సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తన కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చింది సాయి పల్లవి. చాలా మంది ఈ సినిమాను థియేటర్ లలో మిస్ అయ్యారు.

దీంతో ఓటీటీలో గార్గి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గార్గి టీం గుడ్ న్యూస్ చెప్పింది. గార్గి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ నెల 12 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్ టాక్ వచ్చినా, థియేటర్ లో ఆడలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు