Swathi Muthyam : పోటీ నుంచి అవుట్

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతన్నాడు. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతున్న ఈ మూవీకి లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఓ లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో “ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కావలసి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నాం. రిలీజ్ డేట్ ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా నిర్ణయం తీసుకోక తప్పలేదు. పూర్తి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాం. కరోనా మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చూసి, ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మునుపటిలాగా సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అంటూ మేకర్స్ పేర్కొన్నారు.

అయితే ఆగస్టు 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం, నిఖిల్ కార్తికేయ 2 రావాల్సి ఉండగా, నిఖిల్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు స్వాతిముత్యం టీం కూడా వెనక్కు తగ్గింది. కొత్త రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు