Karthikeya 2 : ఓటీటీ రిలీజ్ అప్పుడే ?

టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ2 సినిమాతో వస్తున్న సంగతి విధితమే. ముందుగా ఈ సినిమాను జూలై 22వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు వాయిదా పడగా మళ్లీ ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లి ఇప్పుడు 12న కాకుండా ఒక రోజు వెనక్కి వెళ్లి 13వ తేదీన వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన ఈ రోజే వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కార్తికేయ2 ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించారు. కార్తికేయ2 విడుదలైన తేదీ నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని వెల్లడించారు. కాగ ఇటీవల నిర్మాతల మండలి ఓటీటీ రిలీజ్ పై నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సినిమాలు 10 వారాల తర్వాత, చిన్న సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఓటీటీలో వచ్చే పక్కా కమర్షియల్, థాంక్యూ, ది వారియర్ సినిమాలు ఇలాగే చేస్తున్నాయి. కానీ, కార్తికేయ2 మూవీ మేకర్స్ మాత్రం ఏడు వారాల తర్వాత ఓటీటీకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా నిఖిల్ సినీ కెరీర్ లో భారీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే వీలైనన్నీ రోజులు థియేటర్ లలో ఉంచాలని భావిస్తున్నారు. అందుకోసం రెండు సార్లు సినిమాను వాయిదా కూడా వేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు