RGV : కారణం రాజమౌళినే

రామ్ గోపాల్ వర్మ.. పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. అందుకు వర్మను వివాదాస్పద డైరెక్టర్ అని కూడా అంటారు. సోషల్ మీడియాలో కూడా వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయాల్లోనూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. దీంతో కొన్ని రోజులు ఇండస్ట్రీలో రచ్చ అవుతుంది. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో అగ్ర దర్శకుడు రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం రాజమౌళినే అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. దీని కోసం రాజమౌళి రెండు పనులు చేశాడని అన్నారు. ఒకటి.. సినిమాను బాగా చేస్తే వేల కోట్ల కలెక్షన్లు వస్తాయని నిరూపించాడు అని తెలిపాడు. అలాగే రెండోది.. సినిమాను క్వాలిటీగా తీస్తే రికార్డులు నమోదు అవుతాయని చేసి చూపించాడని వర్మ అన్నారు. దీని వల్ల ఇతర దర్శకులు రాజమౌళి కంటే పెద్ద సినిమాలు చేయాలని చూస్తున్నారు అని అన్నారు. ఈ ప్రయత్నంలో సినిమాలు ప్రేక్షకుల టేస్ట్ కు అనుకూలంగా రావడం లేదని వెల్లడించాడు.

ఈ ఇంటర్వ్యూ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. థియేటర్ల ప్రాబ్లమ్.. ఓటీటీలు కాదు.. అసలు శత్రువులు రాజమౌళి, యూట్యూబ్ అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఈ ట్వీట్ పై నెటిజన్ ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు