Pushpa-2 : ఒకే సెట్ లో బన్నీ-సుక్కు

అల్లు అర్జున్, సుకుమార్ అంటే గుర్తుకు వచ్చే సినిమా పుష్ప. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడో సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు పుష్ప కు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతుంది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఒకింత అసహనంగానే ఉన్నారు. పుష్ప రెండో భాగం షూటింగ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఒకే సెట్ కనిపించారు. వీరి పక్కన కెమెరా మెన్ రత్నవేలు కూడా ఉన్నాడు. దీంతో పుష్ప రెండో భాగం షూటింగ్ స్టార్ట్ అయిందా అనుకున్నారు. కానీ అసలు నిజమేంటి అంటే, అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో వరుసగా యాడ్స్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ లతో యాడ్స్ చేశాడు. తాజాగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో కూడా యాడ్ చేస్తున్నాడు. ఈ యాడ్ కు కెమెరామెన్ గా రత్నవేలు పని చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ ఫోటోలను కెమెరా మెన్ రత్నవేలు తన ట్విట్టర్ తో పంచుకున్నాడు. 18 ఏళ్ల తర్వాత తాము మళ్లీ కలిసి పని చేస్తున్నామంటూ ఒక పోస్టును పెట్టాడు. కాగ అల్లు అర్జున్-సుకుమార్-రత్నవేలు 18 ఏళ్ల క్రితం ఆర్య సినిమాకు పని చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు