Megastar: చిరు – వశిష్ఠ సినిమా నిర్మాతలకు పెద్ద పరీక్షే…!

మెగాస్టార్ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబినేషన్లో సినిమా రానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది సోషల్ మీడియాలో. ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్లో రూపొందనుందని సినిమా టైటిల్ ముల్లోక వీరుడు అని ఫిక్స్ చేశారని ఆ వార్తల సారాంశం. అంతే కాకుండా ఈ సినిమాలో ఏకంగా 12మంది హీరోయిన్లు కనిపించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అసలే సీనియర్ హీరోల సరసన నటించటానికి టాప్ హీరోయిన్స్ ఒప్పుకోని పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిరంజీవి సినిమాలో డజను మంది హీరోయిన్లన్న వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ముల్లోకాలకు వెళ్లి అక్కడి దేవుళ్లతో ఇంటరాక్ట్ అయ్యే సీక్వెన్స్ ఉంటుందని వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమాకి భారీ బడ్జెట్ అవసరమయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో సోషియో ఫాంటసీ జానర్లో రానున్న ఈ సినిమాను గనక పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుందా, చిరంజీవి మీద అంత భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తారా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. వాస్తవానికి టాలీవుడ్లో 100కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో తన ఖాతాలో ఉన్నప్పటికీ చిరంజీవికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో చిరంజీవి సరసన 12మంది హీరోయిన్లను సెట్ చేయటం ఒక టాస్క్ అయితే భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమా తీయటం అన్నది రిస్క్ అనే చెప్పాలి.

ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో మరో సినిమా ప్లాన్ చేసి 2024సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ వశిష్ఠకి ఇస్తాడా లేక కళ్యాణ్ కృష్ణకి ఇస్తాడా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు