Adipurush: ఫెయిల్యూర్ కి బాధ్యులు ఎవరు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఈ సినిమా టీజర్ సమయంలో విజువల్స్ మీద తీవ్ర విమర్శలొచ్చిన నేపథ్యంలో విడుదల వాయిదా వేసి మరీ చాలా సమయం తీసుకొని వీఎఫెక్స్ కి మార్పులు చేశారు. వీఎఫెక్స్ పునరుద్దరించాక రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చింది సినిమా యూనిట్. ఆ తర్వాత రిలీజ్ అయిన జై శ్రీరామ్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది.

సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవటం, వచ్చిన చిన్న సినిమాల్లో దసరా, విరూపాక్ష మినహా మిగతావన్నీ డిజాస్టర్స్ కావటంతో తెలుగు ప్రేక్షకుడు సమ్మర్ ఎండింగ్ లో వచ్చిన ఆదిపురుష్ పైనే ఆశలన్నీ పెట్టుకొని ఎదురు చూడగా, ఆదిపురుష్ సినిమా కూడా నిరాశే మిగిల్చిందని చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ తర్వాత విజువల్స్ పై నమ్మకం పెట్టుకొని వెళ్లిన ప్రేక్షకుడు ఆ విషయంలో మోసపోయాడు. రామ రావణ యుద్దాన్ని అవెంజర్స్ తరహా యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసిన ఓం రౌత్, మనం చూస్తున్నది రామాయణమేనా అనుమానం కలిగేలా చేశాడు. రామాయణం లాంటి ఎపిక్ ని టచ్ చేయటమే పెద్ద రిస్క్ అనుకుంటే, దర్శకుడు క్యారెక్టర్స్ లుక్స్ విషయంలో, కథలోని కీలక అంశాల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసి దృశ్యకావ్యంగా ఉండాల్సిన కథని కృత్రిమత్వంతో నింపేసాడు.

రామాయణం లోని ఎమోషన్ ని లైట్ తీసుకొని కేవలం రామరావణ యుద్ధం మీదనే ఎక్కువ దృష్టి పెట్టిన ఓం, సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడి సహనానికి పరిసుఖా పెట్టాడనే చెప్పాలి. రాముడిగా ప్రభాస్ లుక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం ఈ సినిమాకి మైనస్ అయ్యిందనే చెప్పాలి. మొత్తానికి కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్టు ఈ సినిమా ఫెయిల్యూర్ కి కారణాలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ తయారవుతుంది. మరి ఈ ఎపిక్ ఫెయిల్యూర్ కి ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు