Rajinikanth: జైలర్ సినిమాను వదిలేసిన మెగా హీరో ?

Rajinikanth:

జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక గ్రాసర్ గా నిలిచింది. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ ప్రారంభం నుంచి భారీ వసుళ్లను రాబట్టింది. చాలా రికార్డులను బద్దలు కొట్టింది. తలైవా ఇస్ బ్యాక్ అంటూ రజిని అభిమానులు సంబరాలు చేసుకునే అంత భారీ విజయాన్ని దక్కించుకుంది.

జైలర్ సినిమాలో ముత్తువేల్ పాండియన్ పవర్ ఫుల్ పాటలు కనిపించారు రజినీకాంత్. రిటైర్డ్ జైలర్ పాత్రను పోషించారు. రజినీకాంత్ స్టైల్, యాక్షన్ ఈ చిత్రంలో అందరిని ఆకట్టుకుంది. బీస్ట్ పరాజయం తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్… ఈ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ సినిమాని తోలుత సూపర్ స్టార్ రజినీకాంత్ కంటే ముందే వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

తెలుగులో తొలి డెబ్యు సినిమాగా ఇదే చేయాలని ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజుని కలిశాడు. ఆయన ఈ స్టోరీ లైన్ వినగానే నేరుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. చిరంజీవికి స్టోరీ మొత్తం వినిపించిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇలాంటి సబ్జెక్టులో నన్ను నా అభిమానులు చూడగలరా? రీ ఎంట్రీ తర్వాత పూర్తిగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఇటువంటి సబ్జెక్ట్స్ ని ఎంచుకోవడం రిస్క్ అని భావించి ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదట చిరంజీవి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు