Gam Gam Ganesha: ఈ సారి కామెడీని నమ్ముకున్న ‘చిన్న కొండ’..

Gam Gam Ganesha Movie:

బేబీ సినిమా బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ లో ఉన్నాడు ఆనంద్ దేవరకొండ. మొన్నటివరకు విజయ్ దేవరకొండ తమ్ముడిగా పేరు తెచ్చుకున్న ఆనంద్ ఇప్పుడు బేబీ తో తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో పెరఫార్మన్స్ పరంగా విరాజ్, వైష్ణవి కంటే ఎక్కువ పేరు ఆనంద్ కే వచ్చిందన్న సంగతి తెలిసిందే. దానికి ఆ ప్లేస్ లో చాలా మంది ప్రేమికులు వాళ్ళని ఊహించుకోవడమే రీసన్.

ఇక ఆనంద్ దేవరకొండ కి బేబీ సినిమా తరువాత వరుస ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది. అయితే అందరిలా మాస్ జోనర్లో రొటీన్ గా పోకుండా, కామెడీ జోనర్ లో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఇక చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు “గం గం గణేశా” అని టైటిల్ పెట్టారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో నటీనటుల డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయితే నవంబర్ చివరి వారంలో, లేదా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఆనంద్ హిట్ పరంపర కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు