Baby: చిన్న కొండ ప్రూవ్ చేసుకున్నట్టే..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ బిగినింగ్ నుండి మంచి కథా బలం ఉన్న సినిమాలే చేసినప్పటికీ సరైన హిట్ లేకపోగా, నటుడిగా ఆనంద్ కి పెద్దగా అప్లాజ్ దక్కలేదు. ఇప్పుడు బేబీ సినిమాలో ఆనంద్ నటనకు మంచి ప్రసంశలు అందుతున్నాయి. ఈ సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్లో ఆనంద్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్లు, క్లైమాక్స్ లో చిన్న కొండ ఎమోషన్ పండించటంలో సక్సెస్ అయ్యాడు. ఇన్నాళ్లు విజయ్ దేవరకొండ వల్లే అఫార్ల్య్ వస్తున్నాయన్న అపవాదుని ఈ సినిమా ద్వారా ఆనంద్ చెరిపేసినట్లే అని చెప్పాలి.

బేబీ సినిమాలో మరో హీరో విరాజ్ లుక్స్ పరంగా ఆనంద్ కంటే బెటర్ గా ఉన్నప్పటికీ ఆడియెన్స్ మాత్రం ఆనంద్ క్యారెక్టర్ కే ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా రిలీజ్ ముందు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆనంద్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. బేబీ సినిమా పూర్తయ్యాక రిలీజ్ కి ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఆనంద్ ఈ సినిమా రిలీజ్ కోసం వేరే ఏ ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వకుండా వెయిట్ చేశాడు.

మొత్తానికి అల్లు శిరీష్ తరహాలోనే ఆనంద్ దేవరకొండ కూడా స్ట్రగుల్ అవ్వక తప్పదు అని అనుకున్న వారికి బేబీ సినిమాతో గట్టి సమాధానం ఇచ్చాడు చిన్న కొండ. తమ్ముడి సక్సెస్ కి ఆనంద పడిన విజయ్ దేవరకొండ వైష్ణవి, ఆనంద్ లకు స్పెషల్ పార్టీ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఆనంద్ ఇక మీదట ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు