Mega154: స్టెప్ వేయడమే..

ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. కానీ, ఆచార్య దారుణంగా నిరాశపరిచింది. దీని తర్వాత వచ్చే సినిమాలపై మెగాస్టార్ ఫోకస్ పెట్టాడు. రాబోయే సినిమాలు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పూర్వ వైభవాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు చిరు గ్యాప్ లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాల్లో మెగాస్టార్ ఒక కామన్ పాయింట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ మూడు సినిమాల్లో తనతో పాటు మరో హీరో ఉండేలా చిరు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్యలో రవితేజ చేస్తున్నాడు. రవితేజ ఇప్పటికే షూటింగ్ సెట్ లో కూడా చేరిపోయాడు. భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కు జోడీగా ఒక యంగ్ హీరో ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఇటీవల మాచర్ల నియోజక వర్గంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ తో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా చిరు తన సినిమాలో ఉండే సెకెండ్ హీరోలతో ఒక సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తో “భలే భలే బంజారా..” స్టెప్ లు వేసిన విషయం తెలిసిందే. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ఒక పాటలో డ్యాన్స్ చేస్తున్నట్టు ఒక ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పుడు రవితేజతో కూడా చిరు స్టెప్ లు వేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

- Advertisement -

వాల్తేరు వీరయ్యలో అలాంటి సందర్భం లేకున్నా.. రవితేజతో కలిసి డ్యాన్స్ చేసేలా ఒక పాటను పెట్టాలని డైరెక్టర్ బాబీపై చిరు ఒత్తిడి తీసుకువస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో చిరు కోరిక మేరకు రవితేజ-చిరు స్టెప్ లు వేయడానికి బాబీ రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు