Chiranjeevi: బోయపాటి శ్రీను నెక్స్ట్ టార్గెట్ మెగా స్టార్

మెగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఏకంగా మెగా స్టారే నటిస్తే ఎలా ఉంటది? బోయపాటి రాసే మాస్ డైలాగ్స్ ను ఏకంగా మాస్ మూల విరాట్ చిరంజీవినే చెబితే ఆ హై ఎలా ఉంటది? బోయపాటి సినిమాలలో ఉండే ఆ పీక్ ఎలివేషన్స్ లో చిరు తెర మీద కనిపిస్తే ఆ ఊహ ఎలా ఉంటది ? తలుచుకుంటేనే గూస్ బమ్స్ వస్తున్నాయి కాదా !అయితే ఇది త్వరలోనే నిజం అయ్యేలా ఉందని ఫిలిం నగర్ లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న రిలీజై ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతుండగానే, డైరెక్టర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ చిత్రంపై ఇంట్రెస్టింగ్ బజ్ నెట్ లో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

స్కంద సినిమా తరువాత బోయపాటిశ్రీను నందమూరి బాలకృష్ణ తో అఖండ పార్ట్ 2 చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం బోయపాటి, చిరంజీవి తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయట.

- Advertisement -

చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ఠ తో మరియు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం చిరంజీవి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నడట. మెగా మాస్ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడట. ఇక త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రానుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

అయితే బోయపాటి శ్రీను తో మెగా స్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే ఈ వార్త ..మెగా అభిమానులలో కొంతమందిలో ఉత్సాహాన్ని నింపితే మరి కొంత మందిని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చిరంజీవి రీమేక్ సినిమాలకు మరియు క్రింజ్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి, తన వయసును దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఎంచుకుంటున్నాడు. మరి ఇటువంటి సమయంలో చిరంజీవి బోయపాటితో సినిమా చేయడం మెగా అభిమానుల్లో ఒకింత టెన్షన్ ను రేకెత్తిస్తుంది.

దీనికి కారణం బోయపాటి స్టయిల్ అఫ్ మేకింగ్ అని తెలుస్తుంది. అలాగే దానికి తోడు రామ్ చరణ్ తో కలిసి బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామా సినిమా భారీ డిజాస్టర్ అయింది. రామ్ చరణ్ డిజాస్టర్ కు ఇచ్చిన బోయపాటి చిరంజీవి హిట్ ఇస్తాడనే నమ్మకం మెగా అభిమానుల్లో కనిపించడం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు