Bigboss Jail: తేజ లక్కీ బాయ్.. ఒక్కరోజుకే రిలీజ్ అయ్యాడు..!

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నిన్న నామినేషన్ల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాసెస్ లో భాగంగా నామినేషన్లలో తేజ ఎవరు నామినేట్ చేయకుండానే తాను చేసిన తప్పుకు నామినేట్ కాగా, మిగతా వాళ్ళు ఎవరికి తోచినట్టు వారిని నామినేట్ చేసుకున్నారు. అయితే తేజ గత వారం స్మైలింగ్ టాస్క్ లో గౌతమ్ ని బెల్ట్ తో కొట్టినందుకు పనిష్మెంట్ గా బిగ్ బాస్ తేజని జైలుకి పంపించడం జరిగింది.

అయితే ముందుగా సంచలక్ సందీప్ ఇంటికి పంపించేద్దామని అనగా, నాగార్జున తప్పులు మరోసారి రిపీట్ అవ్వకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి, జైలుకి పంపించడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ వారమంతా అంటే 6 రోజులు జైలులో ఉండాలని చెప్పగా, నిన్న మొత్తం జైలులో ఉన్నాడు తేజ. ఇక తేజని జైలులో ఉన్నన్ని రోజులు గౌతమ్ ఎం చెప్పినా చేయాలనీ నాగార్జున చెప్పగా దానికి సరేనన్నాడు. ఈ క్రమంలో తేజని సరదాగా బయటికి పిలిచి ఒకసారి హెడ్ మసాజ్ కూడా చేయించుకున్నాడు.

కానీ తెల్లవారేసరికి బిగ్ బాస్ కరుణించాడు. తేజ తన తప్పు తెలుసుకున్నాడని భావించిన బిగ్ బాస్ ఒక్క రోజుకే రిలీజ్ చేయడం జరిగింది. ఇక బయటికి రాగానే మరోసారి గౌతమ్ కి సారీ చెప్పిన తేజ మళ్ళీ ఎప్పుడూ తప్పు చేయనని బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు. అయితే ఇంతకు ముందు సీజన్లలో హౌస్ మేట్స్ వారం రోజులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు