Kiara Advani Comments: మెగా హీరోని లైవ్ లోనే బూతులు తిట్టేసింది

తెలుగులో వచ్చి రావడంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి ఆడి పాడిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. భరత్ అనే నేను సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమాతో డిజాస్టర్ అందుకుంది ఈ బ్యూటీ. అనంతరం మరికొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో ఒప్పుకోలేదు. ఇక ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా.

ఇదంతా పక్కన పెడితే చాలా మంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొంతమంది హీరో, హీరోయిన్లు హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్ కి వెళుతూ ఉంటారు. అలా అప్పట్లో దగ్గుబాటి రానా హోస్ట్ గా నిర్వహించిన నెంబర్ 1 యారి విత్ రానా అనే షో కి ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చి ఎన్నో తెలియని విషయాలను బయట పెట్టేవారు. అలా అప్పట్లో రామ్ చరణ్ తన సహనటి అయిన కియారా అద్వానీతో కలిసి ఆ షోకి వచ్చారు. ఈ షోలో రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది కియారా. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎవరైనా ప్రీ రిలీజ్ లేదా ఏదైనా ఈవెంట్ కి వచ్చి మాట్లాడే సమయంలో హాయ్, హలో, నమస్తే అంటూ ఏదో ఒక విధంగా పలకరిస్తారు. కానీ కియారా మాత్రం పాతకాలం అమ్మాయిలా సభకు నమస్కారం అంటూ చెప్పిందని రామ్ చరణ్, రానాకి చెబుతూ ఇద్దరూ నవ్వుకున్నారు. దీంతో అలా చెప్పమని నువ్వే అన్నావు కదా “బద్మాష్” అంటూ రాంచరణ్ ని లైవ్ లోనే ఫన్నీగా తిట్టింది కియారా.

- Advertisement -

అయితే కియారాని ఆటపట్టించడం కోసమే ఆమెకు తెలుగు రాదని రామ్ చరణ్ అలా మాట్లాడమని చెప్పారట. అయితే ఇదంతా సరదాగా జరిగిన సంభాషణ అయినప్పటికీ కియారా మాత్రం తన మనసులోని ఫీలింగ్ ని బయటపెట్టిందంటూ ఫ్యాన్స్ అప్పుడు ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేశారు. ఇది పాత వీడియోనే అయినా, ప్రస్తుతం ఈ జంట గేమ్ ఛేంజర్ లో కలిసి నటించడం వల్ల ఇప్పుడు వైరల్ అవుతుంది.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Bollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest Tollywood entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు