Bigboss season7: తేజకి బదులు రతికాని ఎలిమినేట్ చేయడం వెనుక బిగ్ బాస్ స్ట్రాటజీ ఉందా?

Bigboss season7:

టెలివిజన్ లో బిగ్ బాస్ 7 సీజన్ ఊహించని విధంగా సాగుతుంది. సీజన్ మొదలైనప్పుడే అంతా ఉల్టా పల్టా గా ఉంటుందని నాగార్జున చెప్పినట్టుగానే, కంటెస్టెంట్స్ మొదలుకొని, టాస్క్ లు, గేమ్ లు, ఎలిమినేషన్ లు కూడా ఊహించని విధంగా సాగుతున్నాయి. మొదటి రెండు ఎలిమినేషన్లు ఊహించినట్టుగానే జరగగా ఆ తర్వాతి రెండు ఎలిమినేషన్లు మాత్రం ఆడియన్స్ కి ఊహించినట్టుగా జరగలేదు.

లేటెస్ట్ గా రాతిక ఎలిమినేషన్ లో అలాగే జరిగింది. వోటింగ్ పరంగా, రతిక కంటే తక్కువగా తేజకి వచ్చినా, రతిక ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇలా తేజ కి బదులు రతిక ఎలిమినేట్ అవడం వెనుక బిగ్ బాస్ స్ట్రాటజీ వేరే ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు.

ఇద్దరినీ ఒక్కసారి కంపేర్ చేస్తే రాతిక చాలా గేమ్ లు ఆడుతున్నప్పటికీ విన్ అవ్వట్లేదు. పైగా హౌస్ మేట్స్ తో చీటికీ మాటికీ గొడవ పడుతుంది. దానివల్ల ఆడియన్స్ దృష్టిలో కొంత నెగిటివ్ అయ్యింది రతిక. ఇక తేజ విషయానికి వస్తే టాస్క్ లలో ఆట పరంగా చాలా వెనుకబడి ఉన్నాడు. పైగా చాలా లేజి గా పనిచేస్తాడు. అయినా బిగ్ బాస్ తనని సేవ్ చేయడానికి కారణం ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే అని అనిపిస్తుంది.

- Advertisement -

ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందర్నీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ షో కి మంచి రేటింగ్ వచ్చేలా చేస్తుంది తేజయే అని బిగ్ బాస్ భావిస్తున్నాడు అని నెటిజన్లు అంటున్నారు. అందుకే గౌతమ్ విషయంలో కూడా తేజ తప్పు చాలా ఉన్నా, జైలుకి పంపిస్తున్నారే తప్ప ఎలిమినేట్ చెయ్యట్లేదు అని ఆడియన్స్ అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని చాలా మంది ఆడియన్స్ తేజ ఈ వారమే ఎలిమినేట్ కావాల్సిందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు