Bigboss season 7: తేజ తో మసాజ్ చేయించుకుంటున్న గౌతమ్..!

Bigboss season 7:

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో వారం పూర్తయి ఐదో వారంలోకి ఎంటర్ అవగా, ఈ వారం లో తేజ మొత్తం 7 రోజులు జైలులో ఉండాల్సి వస్తుంది. బిగ్ బాస్ నుండి జైలు యొక్క లాకర్ కీ వచ్చిన వెంటనే ఆ ఇంటి సభ్యులందరూ కలిసి తేజ ని జైలుకి పంపించారు. అంతే కాదు జైలులో ఉన్నన్ని రోజులు తేజ మూడు పూటలా కేవలం రాగి జావ తాగి ఉండాల్సి వస్తుంది అని బిగ్ బాస్ ఆదేశమిచ్చాడు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో శివాజీ హౌస్ మేట్ నుండి తిరిగి కంటెస్టెంట్ గా మారినందున అతని vip రూమ్ ని తిరిగి తీసుకున్నారు. అప్పుడు స్టాండర్డ్ రూమ్ లో తేజ బెడ్ ని శివాజీ కి కేటాయిద్దామని హౌస్ మేట్ సందీప్ భావించగా, దానికి తేజ ఒప్పుకోకపోవడంతో, డీలక్స్ రూమ్ లో షకీలా బెడ్ ని ఇవ్వడం జరిగింది.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు తేజ జైలులో ఉన్నన్ని రోజులు గౌతమ్ ఏం చెప్పినా తేజ చేయాల్సి ఉంటుంది. దీన్ని సరదాగా తీసుకున్న గౌతమ్ తనకి మసాజ్ చేయమని బయటికి పిలిచాడు. ఈ రకంగా అప్పుడప్పుడు తేజ బయటికి వస్తూ గౌతమ్ తలకు మసాజ్ చేస్తున్నాడు తేజ. అలాగే గౌతమ్ చెప్పే వేరే పనులు కూడా చేయాల్సి వస్తుంది. దీన్ని సరదాగానే తీసుకున్న తేజ ఇంకెవరికైనా మసాజ్ చేయించుకోవాలనుకుంటే కూడా చెప్పండి చేస్తా అని అన్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు