Bigg Boss Season7: తేజ చేసిన పనికి గౌతమ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది..!

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్ 7 రోజులు గడిచే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. నామినేషన్స్ సమయంలో మాత్రమే కాకుండా ఈ సారి ఫిజికల్ టాస్క్ లు కూడా చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ యాక్టివ్ గా ఉండటంతో షో ఆసక్తిగా సాగుతోంది.

గత సీజన్స్ లాగా కాకుండా ఈ సారి హౌస్ మెట్ అయ్యే అర్హత కోసం పవర్ అస్త్ర టాస్క్ విన్ అవ్వాలనే కండిషన్ పెట్టింది బిగ్ బాస్ టీమ్. ఈ టాస్క్ లో భాగంగా గత వారం కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. అయితే, టేస్టీ తేజ గౌతమ్ పట్ల ప్రవర్తించిన తీరుకి హౌస్ మేట్స్ నుండే కాకుండా ఆడియెన్స్ నుండి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాగార్జున ఈ టాపిక్ గురించి తేజకి క్లాస్ పీకాడు. ఆ సమయంలో తేజ ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా గౌతమ్ కంట్రోల్ తప్పకుండా ఉండటం, టాస్క్ తర్వాత కూడా ఆ టాపిక్ ఎత్తకుండా సైలెంట్ గా ఉండటం పట్ల నాగార్జున అప్రిషియేట్ చేసాడు. గౌతమ్ ని జెంటిల్ మెన్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

- Advertisement -

ఇంతకాలం గౌతమ్ సైలెంట్ గా డల్ గా ఉండటంతో హౌస్ మేట్స్ తో పాటు ఆడియెన్స్ కూడా అతన్ని లైట్ తీసుకున్నారు. గత వారం టాస్క్ తర్వాత గౌతమ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. గౌతమ్ మెచ్యూరిటీ లెవెల్స్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అతను ఇలాగే కంటిన్యూ అయితే గనక ఫైనల్స్ కి వెళ్ళటం ఖాయమని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు