Shruti Hasan: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినా లాభం లేదా..? 

టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం పొంది టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది శృతి హాసన్. అందం అభినయం లోనే కాకుండా సింగింగ్ లో కూడా తన ప్రతిభ కనబరుస్తూ తండ్రికి తగ్గ తనయ అని ప్రూవ్ చేసుకుంది. గత కొంత కాలంగా శృతికి సరైన హిట్స్ లేక అవకాశాలు సన్నగిల్లాయి. అయితే లాక్డౌన్ తర్వాత వచ్చిన క్రాక్, వకీల్ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకుంది శృతి హాసన్. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ టాలీవుడ్లో బిజీ అయినట్టే అన్న సంకేతాలు ఇచ్చింది.

టాప్ హీరోలతో వసరుస హిట్స్ అందుకున్న శృతికి ఆ రేంజ్ లో అవకాశాలు రాలేదని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న సలార్ మినహా తెలుగు సినిమాలు ఏవీ శృతి లైనప్ లో లేవు. తాజాగా నాని 30వ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం శ్రుతిని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. వరుస హిట్స్ అందుకున్న తర్వాత శృతి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్ యాక్సెప్ట్ చేయటం  చూస్తే సరైన అవకాశాలు రావట్లేదని చెప్పాలి.

ఇటీవలే మొదలైన నాని 30వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం గోవాలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం శ్రుతిని మేకర్స్ సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితమైన శృతి నాని 30వ సినిమా తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు