Baby: అన్నకు అర్జున్ రెడ్డి లాగా తమ్ముడికి బేబీ…?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కలర్ ఫోటో సినిమా ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న సాయిరాజేష్ డైరెక్షన్లో రూపొందిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటంతో  సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బేబీ ట్రైలర్లో ఆనంద్ యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడన్న కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా లాగా ఆనంద్ కి బేబీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. కెరీర్ ఆరంభం నుండి కథా బలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండకి సరైన హిట్ లేని నేపథ్యంలో బేబీ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది.

జులై 14న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ముందు రోజే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేసింది సినిమా యూనిట్. ఈ ప్రీమియర్స్ కి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ నమోదవడంతో సినిమా యూనిట్ కూడా ఎంతో నమ్మకంగా ఉంది. ప్రీమియర్స్ లో డీసెంట్ టాక్ గనక సొంతం చేసుకుంటే, బేబీ సినిమా ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేసే అవకాశం ఉంది.

ఈ వారం తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవటం కూడా బేబీ సినిమాకి కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. అదే రోజున రిలీజ్ అవుతున్న మహావీరుడు, నాయకుడు వంటి డబ్బింగ్ సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ లేని నేపథ్యంలో వాటి నుండి నామమాత్రపు పోటీ కూడా ఉండే అవకాశం లేదు. మరి, కెరీర్ ఆరంభం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆనంద్ కి బేబీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు