Leo: ‘లియో’లో మరో స్టార్ హీరో – రోలెక్స్ ను మించిపోతాడా..? 

లోకేష్ కనగరాజ్, ప్రస్తుతం కోలీవుడ్, తో టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న యువ డైరెక్టర్.కార్తీ  నటించిన ఖైదీ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన లోకేష్, తర్వాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. గతేడాది వచ్చిన విక్రమ్ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని, హాలీవుడ్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘యూనివర్స్’ కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. ప్రస్తుతం లోకేష్, దళపతి విజయ్ కాంబినేషన్లో లియో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ లో భాగమే అన్న టాక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

తాజాగా, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి. అంతే కాక ధనుష్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ లాగా ఉండబోతుందని సమాచారం. ఇదే గనక నిజం అయితే ధనుష్ రోలెక్స్ తరహా పాత్రలో విజృంభించటం ఖాయం. విక్రమ్ లో రోలెక్స్ పాత్ర క్లైమాక్స్ లో వచ్చినప్పటికీ అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నటనలో సూర్యకి ఏ మాత్రం తీసిపోని ధనుష్ కి కూడా అలాంటి క్యారెక్టర్ పడితే అరాచకానికి నిర్వచనంలా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

లియో సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకట్టుకొని సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేయగలిగింది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్త కూడా నిజమే అయితే సినిమాపై అంచనాలు మరింత పెరగటం ఖాయం. మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ధనుష్ క్యారెక్టర్ ఉండబోతుందా, ఉంటే రోలెక్స్ పాత్ర తరహాలో ఉండబోతుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు