Allu Arjun: వైరల్ అవుతున్న పుష్ప2 పిక్ వెనక కథ ఇదేనా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న పుష్ప 2 షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన “వేర్ ఈజ్ పుష్ప” వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా విడుదలైన పోస్టర్ ఒకటి సినిమాపై మరింత ఆసకక్తి పెంచే విదంగా ఉంది. అల్లు అర్జున్ చీర కట్టులో, ఒక చేతిలో గన్ పట్టుకొని సీరియస్ లుక్ తో ఉన్న ఫోటో నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

సినిమాపై అంచనాలు పెంచుతున్న ఆ ఫోటో వెనుక పెద్ద కథే ఉందన్న అనుమానం వస్తుంది. పుష్ప కథ చిత్తూరు నేపథ్యంలో సాగటమే అందుకు కారణం, చీరకట్టులో ఉన్న అల్లు అర్జున్ ని చూస్తుంటే తిరుపతిలో వైభవంగా జరిగే గంగ జాతరను సినిమా కథలో  వాడుకున్నారా అన్న అనుమానం వస్తోంది. తిరుపతి గంగ జాతర సమయంలో పురుషులు ఆడవేషం వేసుకొని గంగమ్మ పూజలో పాల్గొనటం, ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ కూడా చీరకట్టులో కనిపిస్తుండటం ఇక్కడ కోఇన్సిడెన్స్ అనిపిస్తుంది.

అయితే చేతిలో గన్ ఉండటాన్ని బట్టి చుస్తే గంగ జాతర సీక్వెన్స్ ను విలన్ మీద అటాక్ చేసేందుకు వాడుకున్నట్టు అనిపిస్తుంది.ఈ ఊహాగానాలే గనక నిజం అయితే, గంగ జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. పుష్ప పార్ట్ 1 కథ కూడా చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉండటం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది. మొత్తానికి ఉన్నపలంగా హీట్ పెంచిన పుష్ప2 పిక్ వెనక ఇంత కథ ఉందా లేదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు