Tollywood: ఆ మూడు సినిమాలు వరుస హిట్స్ అవుతాయా..?

టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది, RRR ఇచ్చిన స్పూర్తితో నిఖిల్, నాని లాంటి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు తీసి సక్సెస్ కొట్టారు. ఈ క్రమంలో వరుసగా పెద్ద హీరోల సినిమాలు రానుండటం, అవి కూడా పాన్ ఇండియా సినిమాలే అవ్వటం ఆసక్తిగా మారింది. ప్రభాస్ నుండి సలార్, ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ 30, పుష్ప2  సినిమాలు ఒకటి తర్వాత ఒకటి విడుదలై ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. తాజాగా పుష్ప2 సినిమాకు సంబంధించి విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక సెప్టెంబర్ 28న విడుదలకు సన్నాహాలు చేస్తున్న ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల సినిమా సాలార్ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఆచార్య డిజాస్టర్ తో డీలా పడ్డ కొరటాల ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలన్న కసితో ఎన్టీఆర్ 30సినిమాను రూపొందించే పనిలో పడ్డాడు. వార్2 సినిమాలో ఎన్టీఆర్ భాగం వాటం కూడా కొరటాల సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. RRR మినహా, పాన్ ఇండియా వైడ్ పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వని తారక్ కు వార్2 సినిమా నార్త్ లో మార్కెట్ పెంచుకోవటానికి కచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పాలి.

మరో పక్క బాహుబలి తర్వాత పాన్ ఇండియా హిట్ అన్నది లేని ప్రభాస్ కు కూడా సలార్ సినిమా కీలకంగా మారింది. పైగా అదిపురుష్ నుండి పేలవమైన క్వాలిటీతో వచ్చిన టీజర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న క్రమంలో ఆశలన్నీ సాలార్ మీదనే పెట్టుకున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావటంతో సాలార్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పటికైతే ప్రామిసింగ్ గా ఉన్న ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకొని టాలీవుడ్ నుండి వచ్చిన పాన్ ఇండియా హిట్స్ వరుసలో నిలుస్తాయి లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు