Amrutha Ayer : క్యూట్ అందాలతో రెచ్చిపోయిన అమృత అయ్యర్ !

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ మెల్లమెల్లగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. బెంగళూరుకు చెందిన అమృత అయ్యర్ రెండేళ్ల నుంచి వరుస తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటుంది.

కోలీవుడ్ లో ఆయా పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటీ…. ఇక తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ఇక్కడి ఆడియన్స్ కు దగ్గర అవుతోంది. అమృత అయ్యర్…. దళపతి విజయ్ నటించిన ‘విజిల్’ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది అమృత అయ్యర్. రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో గాయత్రి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్ గా టాలీవుడ్ నుంచి అందుకు తొలి అవకాశం ఇదే అని చెప్పాలి.

ఆ వెంటనే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ‘అర్జున ఫాల్గుణ’లో మెరిసింది. రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్. ‘హనుమాన్’ సినిమాతో ఈ అమ్మడి కెరీర్ ఊపందుకునేలా కనిపిస్తుంది. అందం, అభినయం కలిగిన ఈ కుర్ర భామ…. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

- Advertisement -

ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ….దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది అమృత అయ్యర్. అయితే తాజాగా వైట్ డ్రెస్ లో తన అంద చందాలను ఆరబోసింది అమృత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు