Pushpa 2 : ప్రభాస్ బాటలోనే అల్లు అర్జున్… షాకింగ్ రెమ్యూనరేషన్

“పుష్ప” సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఊహించని విధంగా పెరిగింది. పైగా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడంపై కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే తన నెక్స్ట్ మూవీకి ఊహించని రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ బన్నీ డిమాండ్ చేస్తున్న పారితోషికం ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే….

“పుష్ప 2″తో బిజీ బిజీగా…
“పుష్ప” మూవీతో నేషనల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం దాని సీక్వెల్, “పుష్ప 2″పై దృష్టి పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న “పుష్ప 2″ను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్స్ సినీ ప్రియులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ డే అండ్ నైట్ క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్ చేస్తున్నారట. అలాగే జపాన్ లో కూడా “పుష్ప 2” ఆగస్టు 15నే రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరోవైపు దీనికి మూడవ సీక్వెల్ కూడా ఉంటుందని అల్లు అర్జున్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ నెక్స్ట్…
“పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన “గుంటూరు కారం” రిజల్ట్ తో బన్నీ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ తో చేయడం గురించి ఆలోచనలో పడ్డాడు. అలాగే కథలో కూడా చేంజెస్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈలోపు బన్నీ అట్లీతో మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా జవాన్ మూవీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అట్లీ బన్నీతో నెక్స్ట్ మూవీకి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా పూర్తి కాగా, సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ కోసం బన్నీ తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారట.

- Advertisement -

అందుకే ఏకంగా 120 కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడని అంటున్నారు. నిర్మాతలు కూడా ప్రస్తుతం బన్నీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. అయితే ఈ విషయం తెలిసాక అల్లు అర్జున్ కూడా ప్రభాస్ రూట్ లోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇలాగే కంటిన్యూ అయితే అల్లు అర్జున్ పారితోషకం విషయంలో ప్రభాస్ కు పోటీగా నిలవడానికి ఇంకా ఎంతో కాలం పట్టదని అంటున్నారు. “పుష్ప 2” పూర్తవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇక అట్లీ కూడా ఈ మూవీకి భారీగానే పారితోషకం అందుకోబోతున్నాడని అంటున్నారు. అట్లీ అల్లు అర్జున్ తో మూవీ కోసం 60 కోట్లు డిమాండ్ చేశాడని టాక్ నడుస్తోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు