G2 : అడవి శేష్ పెళ్లికి షాక్ ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఫుల్ జోష్ చూపిస్తున్న యువ హీరోలలో అడవి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు అడవి శేష్. ఇండస్ట్రీకి తొలిసారిగా 2010లో ‘కర్మ’ అనే సినిమాతో పరిచయమైన ఈ హీరో విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక 2018 లో విడుదలైన గూడచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ‘హిట్ 2’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ లో సంచలనం క్రియేట్ చేశాడు.

అయితే అక్కినేని నాగార్జున మేన కోడలు, నాగేశ్వరరావు మనమరాలు సుప్రియ, హీరో అడవి శేషు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2019 నుండి వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిసింది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన సుప్రియ.. అడవి శేషు హీరోగా వచ్చిన గూడచారి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అలాగే అడవి శేషు ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీతో బాగా క్లోజ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా చాలాసార్లు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా వీళ్ళ పెళ్ళికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కారణమేంటో తెలియదు కానీ సుప్రియ కూడా అడవి శేష్ ని దూరం పెడుతుందనే వార్త వైరల్ గా మారింది. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రేపు మాపో పెళ్లి అనగా ఈ షాక్ ఏంటి సార్..? అంటూ అడవి శేషు పై కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు