PSPK: “బ్రో” బిజినెస్& బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే! బయ్యర్లకి కాసుల పంటే?

టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో ఒకటి “బ్రో“. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్ తాజాగా బయటికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో 80శాతం సినిమాలో ఉంటానని చెప్పడంతో ఫ్యాన్స్ దీన్ని పవన్ కళ్యాణ్ సినిమాగానే భావిస్తున్నారు.

అందుకే సాలిడ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఎదురవుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా నిర్మాతలు ముందుగానే ఆలోచించి బ్రో సినిమాకి నార్మల్ టికెట్ రేట్లను నిర్ణయించడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాధారణ బయ్యర్లు కూడా సేఫ్ అయ్యేలా తక్కువ రేట్లకి అమ్మడం జరిగింది.

ఒక్కసారి ఏరియా వారీగా “బ్రో” బిజినెస్ లెక్క చూస్తే నైజాం 30 కోట్లు, సీడెడ్ 13.20 కోట్లు, ఉత్తరాంధ్ర 9.50కోట్లు, ఈస్ట్ 6.40 కోట్లు, వెస్ట్ 5.40 కోట్లు, గుంటూరు 7.40 కోట్లు, కృష్ణ 5.20 కోట్లు, నెల్లూరు 3.40కోట్లు జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 80.50 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 5 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల బిజినెస్ జరిగింది.

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 97.50 కోట్ల బిజినెస్ చేసిన బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 98.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. పవన్ కళ్యాణ్ గత చిత్రాల కంటే తక్కువగానే ఈ సినిమా బిజినెస్ జరగగా, సినిమాకి పాజిటివ్ టాక్ గనక వస్తే భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి జులై28న రిలీజ్ అవుతున్న “బ్రో” ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు