Pawan kalyan : బ్రో ప్రి-రిలీజ్ హైలెట్ అయ్యిన స్పీచ్ ఆయనదే

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న బ్రో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వేడుకలో అనుకోకుండా చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన టీజీ వెంకటేష్ వచ్చిరాని తెలుగులో ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది.

ఎవరితను తెలుగును ఇంతగా కూనీ చేసి మాట్లాడుతున్నడంటూ అతనిపై సోషల్ మీడియాలో మిమ్స్ రావడం మొదలైయ్యాయి. నిజానికి ఈయన ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ కు కజిన్ అవుతాడు. అంతేకాదు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ఈయన మినిస్టర్ గా కూడా వర్క్ చేసారు.

నిన్న జరిగిన బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన ఈయన మూవీ టీం గురించి మాట్లాడుతూ అందరికి తన విషెష్ తెలియజేసాడు. అయితే ఇందులో ఏముంది వింత అనుకుంటున్నారా.. అయితే అసలు వింత ఆయన మూవీ టీం గురించి మాట్లాటం కాదు.. సినిమాకు పని చేసిన వారి పేర్లను ఆయన తప్పుగా ఉత్సరించటం. డైరెక్టర్ సముద్రఖని పేరును సముద్రాల గా, సాయి ధరమ్ తేజ్ పేరును.. ధర్మం తేజ అని, అలాగే హీరోయిన్ కేతిక శర్మ ను కీర్తి శర్మ అని స్టేజ్ పై అందరి ముందు మాట్లాడగా ఈ స్పీచ్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది. ఇక మ్యూజిక్ డైరక్టర్ థమన్ పేరు నైతే మరి దారుణంగా తమ్మన్నా అని ఉత్సరించటంతో ఈయన నెటిజన్ల చేతికి చిక్కాడు.

- Advertisement -

ఎవరి నోటి నుంచి ఏ ముక్క దొరికితే వాళ్ళని పట్టుకొని ఒక ఆట ఆడుకుందామని చూసే సోషల్ మీడియా యువతకు బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్ పుణ్యమా అని ఈయన స్పీచ్ దొరికింది. దాంతో మిమర్స్ మరియు నెటిజన్లు అంత ఈయన స్పీచ్ ను నెట్ లో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం హాజరుకాగా, పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు