Pawan Kalyan: ప్రోపర్ ప్లానింగ్ బ్రో

ఒకప్పుడు అంటే ఒక సినిమాను చక చక పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ఒక సినిమాను పూర్తిచేయాలి అంటే చాలా టైం పడుతుంది.
అందులో స్టార్ హీరోల సినిమాలు అయితే మరి లేటు అవుతాయి. ఒక్కోసారి సంవత్సరాలు దాటినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయగలిగాడు సముద్రఖని.

ఏదో ఒక గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు చాలా పద్దతిగా ప్లాన్ చేసి బ్రో సినిమాను పూర్తి చేసాడు సముద్రఖని. తమిళ్ లో రిలీజైన ‘వినోదయ సితం’ సినిమాను మాట వరుసలో త్రివిక్రమ్ కి సముద్రఖని చెప్పడంతో, ఈ ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ కి సెట్ చేసాడు త్రివిక్రమ్. ఒరిజినల్ కథకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను అందించాడు త్రివిక్రమ్.

వాస్తవానికి బ్రో సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ వి కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. కానీ అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉండిపోయాయి.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రం పూర్తయి రిలీజ్ రెడీ అవుతున్నాయి. ఇక బ్రో సినిమా విషయానికి వస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు, కొన్ని రోజులు ముందే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వేసి ఉంచారు. కళ్యాణ్ డేట్స్ ఇచ్చి కరక్ట్ గా హాజరవ్వడంతో కళ్యాణ్ పార్ట్ ను 21 రోజుల్లో పూర్తిచేసారు. అలాని ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాదు.
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ దాదాపు 80% వరకు కనిపిస్తారు. ఏదిఏమైనా ఒక స్టార్ హీరోతో ఇలా సినిమాను ప్లాన్ చేసి, ఇంత త్వరగా ఫినిష్ చెయ్యడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు