రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకతవంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, జై శ్రీరామ్ పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఆ మధ్య నాసిరకం విజువల్స్ తో వచ్చిన టీజర్ సినిమా యూనిట్ ని ట్రోల్స్ కి గురి చేస్తే, ఆ ట్రోల్స్ అన్నిటికి ట్రైలర్ తో సమాధానం చెప్పింది సినిమా యూనిట్. జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మరింత పెంచేలా బిజినెస్ జరిగిందంటూ వార్తలొస్తగున్నాయి. అదేంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబందించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కళ్లు చెదిరే రేట్ కి పీపుల్స్ మీడియా సంస్థ సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.
ఇరు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులకు గాను పీపుల్స్ మీడియా 160 నుండి 170కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేట్ ని ఆఫర్ చేసిందని అంటున్నారు. మొదట్లో యువీ సంస్థ ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేస్తుందని టాక్ వచ్చింది. అయితే రాధేశ్యామ్, సాహో సినిమాలకు సంబంధించి ఇంకా బకాయిలు ఉండటంతో ఆదిపురుష్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఆ సంస్థ తప్పుకుందని అంటున్నారు.తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే, ఇక దేశవ్యాప్తంగా జరగబోయే బిజినెస్ తలచుకుంటే మతి పోవటం గ్యారంటీ.
Read More: Anasuya: అటెన్షన్ కోసమేనా అనసూయ ఈ తిప్పలు..?
ఈ రేంజ్ లో బిజినెస్ జరిగితే గనక ఆదిపురుష్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. టాలీవుడ్ నుండి సమ్మర్ సీజన్ కి గాను ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవటం ఆదిపురుష్ కి కలిసొచ్చే అంశం అని చెప్పాలి. విడుదలైన మీడియం రేంజ్ సినిమాల్లో దసరా, విరూపాక్ష మినహా ఏ ఒక్క సినిమా కూడా అలరించకపోవటం వల్ల తెలుగు ప్రేక్షకుడు మంచి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తావరలోనే విడుదల కానున్న ఆదిపురుష్ కి కుటుంబ సమేతంగా ఆడియెన్స్ క్యూ కట్టడం ఖాయం అని అనిపిస్తుంది.
For More Updates :
Read More: “మనోహరి” కి ఫుల్ డిమాండ్.. ఒక్క పాటకే..!
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్...
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...