Custody: అక్కినేని వారి డిజాస్టర్స్ లో కామన్ పాయింట్ – అదే కొంప ముంచిందా..?

సినిమా సక్సెస్ అవ్వటానికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నట్టు, సినిమా ఫ్లాప్ అవ్వటానికి కూడా కొన్ని సెంటిమెంట్స్ కారణం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం అక్కినేని హీరోలకు వస్తున్న వరుస డిజాస్టర్స్ గమనిస్తే, అన్నిటికీ ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. అదేంటంటే, ఇటీవల వచ్చిన అక్కినేని హీరోల సినిమాలన్నిటికీ ఇంగ్లీష్ టైటిల్స్ ఉండటమే. నాగార్జున హీరోగా వచ్చిన ఆఫీసర్ మొదలుకొని, వైల్డ్ డాగ్, ఘోస్ట్ సినిమాలు ఏ రకంగా డిజాస్టర్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన ‘థ్యాంక్యూ’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ కూడా అఖిల్ కి డిజాస్టర్ తెచ్చి పెట్టింది.

తాజాగా నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమా కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ టైటిల్స్ తమ హీరోలకు డిజాస్టర్స్ తెచ్చి పెట్టాయని అభిమానులు అంటున్నారు. తెలుగు టైటిల్స్ తో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, మజిలీ వంటి సినిమాలు హిట్ అవ్వటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయితే కంటెంట్ బాగుంటే టైటిల్ తో పని లేదని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా రిజల్ట్ గుర్తు చేస్తుంది.

కస్టడీ సినిమాకు ముందు శివ అనే టైటిల్ అనుకున్నారని, కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్ వద్దనుకున్నామని నాగచైతన్య సినిమా ప్రమోషన్స్ సమయంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కస్టడీ కి బదులుగా హీరో క్యారెక్టర్ పేరైన శివ ను టైటిల్ గా పెట్టుంటే బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ అయినా కలిసొచ్చేదని ఫ్యాన్స్ అంటున్నారు. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్టు, అక్కినేని హీరోల వరుస డిజాస్టర్స్ కి ఇంగ్లీష్ టైటిల్స్ కూడా ఒక కారణమే అన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో ఇంగ్లీష్ టైటిల్స్ చేసిన డ్యామేజ్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు