RAPO : బోయపాటి సినీ ప్రస్థానానికి 18 యేళ్లు !

రోజులు మారిన, మనుషులు మారిన ఇండస్ట్రీలో ఎప్పుడు వినిపించేమాట కమర్షియల్ సినిమాలకి చావు లేదని. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్స్ అంత ఈ సినిమాలని, ఈ కథలని నమ్మిన వాళ్లే. అయితే ప్రపంచ సినిమాలతో పోటీపడుతున్న ఈ కాలం దర్శకులకి మాస్, కమర్షియల్ సినిమాలని పెద్దగా నచ్చకపోవచ్చు కానీ ఇప్పటికి, అప్పటికి, ఎప్పటికి అందరు కంప్లిట్ గా ఎంజాయ్ చేసే సినిమాలేవైన ఉన్నాయంటే అవి కేవలం మాస్ సినిమాలు మాత్రమే

అయితే ఒక కమర్షియల్ తీసి హిట్ కొట్టడం అంత తేలికైన పనేం కాదు. ఈ సినిమాలకుండే కష్టాలు ఈ సినిమాలకి కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో రాజమౌళి విషయం పక్కన పెడితే.. వివి వినాయక్ తరువాత కమర్షియల్ సినిమాని బలంగా నమ్మి ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బోయపాటి శ్రీను మాత్రమే. భద్ర సినిమాతో మొదలైన బోయపాటి సినీ ప్రస్థానం హిట్స్ అండ్ ప్లాప్స్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. 18 సంవత్సరాల సినీ జీవితంలో బోయపాటి తీసినవి కేవలం 9 సినిమాలే అయిన ఒకటి, రెండు సినిమాలు మినహా ప్రతి సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బోయపాటి మొదటి సినిమా భద్ర రిలీజై 18 యేళ్లు గడుస్తున్న సందర్బంగా రామ్ సినిమాకి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని ఈ నెల 15న రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా మూవీ యూనిట్ ప్రకటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ ని ఊర మాస్ గా చూపించబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాని పెద్ద ఎత్తున పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.ఈ సినిమా తరువాత బోయపాటి బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేయబోతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు