Biggboss season7: ఫస్ట్ టైం ప్రశంస రాగానే పొంగిపోయిన సొట్ట బుగ్గల సుందరి

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 7 సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ వంటి వారివల్ల ఆట మరింత టఫ్ గా మారగా, భోలే లాంటి ప్లేయర్ల వల్ల మరింత ఫన్ జెనరేట్ అయ్యింది. అలాగే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఒక ప్లేయర్ వల్ల ఆడియన్స్ కి ఫన్ తో పాటు ఒక రకమైన ఇరిటేషన్ కూడా వచ్చింది. ఆ ప్లేయరే అశ్విని శ్రీ.

గ్లామర్ ఫీల్డ్ నుండి వచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో రోజే ఏడుపు మొహం పెట్టి, సోషల్ మీడియా లో ఓ రేంజ్ ట్రోలింగ్ కి గురయింది. ఇక ఆ తరువాత నామినేట్ చేసే ప్రతి సారి ఎదో ఒక గొడవకి దిగడం, లేదంటే ఎవ్వరూ తనతో మాట్లాడడం లేదని అలగడం, అదీ కుదరకపోతే ఏడవడం.. ఇదంతా ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కి ఇరిటేషన్ గా అనిపించేది. కానీ ఫస్ట్ టీం ఈ సొట్ట బుగ్గల సుందరిని నాగార్జున మెచ్చుకోగానే పొంగిపోయింది.

ఇంతకీ అది ఏదంటే కెప్టెన్సీ టాస్క్ లో ఓ గేమ్ లో చాలా బాగా ఆడినందుకు అశ్విని ని బాగా ఆడావని, ఇక ముందు కూడా అలాగే గేమ్ లో ఆడమని, ఇక ఇలా అలగడాలు, ఏడవడాలు వద్దని చెప్పారు. ఏది ఏమైనా నాగార్జున ఫస్ట్ టైం మెచ్చుకోగానే అశ్విని శ్రీ పొంగిపోయింది. అయితే నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది తన ఆట పైనే డిపెండ్ అయి ఉంటుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు