Bhakta Kannappa: మంచు విష్ణు మీద ప్రకృతి పగ పట్టిందా..?

మంచు విష్ణు బీభక్త కన్నప్ప సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప ప్రాజెక్ట్ ని చేయకపోవటం ఒక కారణమైతే, డిజాస్టర్స్ కి బెస్ట్ ఫ్రెండ్ లా మారిన మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయటం మరొక కారణం.

భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశాడు విష్ణు. ఈ సినిమా షూటింగ్ కి న్యూజిలాండ్ లో వాతావరణం, పరిసరాలు అనుకూలిస్తాయని షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు. ఇటీవలే ప్రారంభమైన ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా సినిమా యూనిట్ కి పెద్ద షాక్ తగిలింది.

యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ కుప్పకూలి మంచు విష్ణు చేతి మీద పడటంతో విష్ణు చేతికి గాయమైందని సమాచారం అందుతోంది. దీంతో షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు భక్త కన్నప్ప ప్రాజెక్ట్ చేయటం ప్రకృతికి కూడా నచ్చలేదని అందుకు షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే ఈ అంతరాయం కలిగిందని అంటున్నారు.

- Advertisement -

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ క్యామియో రోల్ లో కనిపించనున్నారని వార్తలున్న నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మొత్తానికి డిజాస్టర్ల పరంపర కొనసాగుతున్న టైమ్ లో మంచు విష్ణుకి ఈ సినిమా ద్వారా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ వస్తుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు