Biggboss season 7: నేనొక వ్యర్ధ పదార్థాన్ని.. ఇన్నాళ్ళకి రియలైజ్ అయిన అమర్!

Biggboss season 7:

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఈ సీజన్లో లో ఎక్కువగా ఇండస్ట్రీ కి సంబంధం లేనివారే రావడంతో ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ క్యారెక్టర్స్ పరంగా కొందరు రొటీన్ గా ఆడుతుండడం వల్ల ఆయా కంటెస్టెంట్స్ ఆట బాగా ఆడుతున్నట్టు అనిపించడం లేదు. వాళ్లలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి.

అయితే ఈ ఇద్దరిలో ప్రశాంత్ శివాజీ చొరవతో ఎక్కువ సార్లు సేవ్ అవుతుండగా, ఆటలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఇకపోతే అమర్ దీప్ కూడా వచ్చినప్పటి నుండి తన ఆటలో స్పెషలిటీ చూపించడం లేదు. పైగా పల్లవి ప్రశాంత్ పై ముందు నుండి గుర్రుగా ఉన్నాడు. ప్రశాంత్ కొన్ని సార్లు తప్పుగా గేమ్ ఆడుతున్నప్పటికీ గేమ్ ఆడలేదని, లేదా గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి గాని, వ్యక్తిగత అభిప్రాయాలతో తక్కువ అంచనా వేయకూడదు.

తాజాగా రంగు పడుద్ది టాస్క్ లో సందీప్ మాస్టర్ కు సపోర్ట్ గా అమర్ దీప్ మాట్లాడి సైలెంట్ గా ఉండకుండా, సందర్భం లేకున్నా కూడా శివాజీ తో అన్న కంగారు పడొద్దు.. ప్రశాంతే గెలుస్తాడులే అంటూ వెటకారంగా అనడం ఏమి బాగాలేదని ఆడియన్స్ భావిస్తున్నారు. దీన్ని శివాజీ సహా హౌస్ లో సభ్యులు కూడా అంగీకరించలేదు. అందుకు మనసు చిన్నబుచ్చుకున్న అమర్ దీప్ తనకెవరూ లేరు, అందరూ ఏకమైపోయారు. నాకెవ్వరి సపోర్ట్ అక్కర్లేదు అంటూ తనలో తానే మాట్లాడుకున్నాడు.

- Advertisement -

ఆ తర్వాత ప్రియాంక వచ్చి ఎందుకిలా ఉన్నావు అని అంటున్నా సరే మొహానికి జోకర్ లా ఎర్ర రంగు రుద్దుకుని నేనొక వ్యర్ధ పదార్ధాన్ని, నన్ను ఒక వ్యర్థ పదార్థంగా చూస్తున్నారు, నన్ను ఎవ్వరు పట్టించుకోరు అని అంటున్నాడు. ఇక ఏడవడం ఒక్కటే అక్కడ తక్కువైంది గావచ్చు. ఈ సీన్ చూసిన ఆడియన్స్ అమర్ దీప్ ఇన్నాళ్ళకి రియలైజ్ అయ్యావా అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు