తమిళ హీరో ధనుష్ మొదటి తెలుగు సినిమా ‘సార్’. ఈ సినిమా ని తెలుగు మరియు తమిళ భాషల్లో నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ లో మంచి వసూళ్లు రాబట్టింది. మంచి మెసేజ్ అందించే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. వంద కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా, మొత్తంగా 120 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది ఈ చిత్రం.
సార్ సినిమా తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ఫ్లిక్స్లో ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి తక్కువ సమయంలోనే గ్లోబల్ రేంజ్కి దూసుకెళ్తుంది. నాన్ ఇంగ్లీష్ కేటగిరీ లో ప్రపంచవ్యాప్తం గా ట్రెండింగ్ లో ఉన్నా సినిమాల లిస్ట్ ను నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ధనుష్ సార్ మూవీ అద్భుతంగా రాణిస్తుంది.
ఈ లిస్ట్ లో తమిళ వెర్షన్ ‘వాతి’ 9వ స్థానం లో ఉండగా తెలుగు వెర్షన్ ‘సార్’ 10వ స్థానం లో నిలవడం విశేషం. మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. సార్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News