నేచురల్ స్టార్ నాని గత ఏడాది ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత అంటే సుందరానికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో నాని ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తెలంగాణ యువకుడి పాత్రలో నాని నటిస్తున్నారు.
‘దసరా’ సినిమాని తెలంగాణకి చెందిన సింగరేణి బొగ్గు గునుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని మాస్ లుక్లో ఆకట్టుకున్నారనే చెప్పాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా మెప్పించారో ఇప్పుడు నాని కూడా దసరాలో అలాంటి లుక్ కనిపిస్తోంది. రెండింటికి దగ్గరి పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ యువకుడి పాత్రలో నటించేందుకు ఇక్కడి యాసపై పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారట నాని. మరోవైపు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘దసరా’ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో కొనసాగుతుంది. మార్చి 30, 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మరి ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. మూవీలో కంటెంట్ ఉంటే కలెక్షన్లు తప్పకుండా వస్తాయని ట్రేడ్ వర్గాల టాక్. నాని దసరా సూపర్ హిట్ అవుతుందో లేదో అనేది వేచి చూడాలి.