Raviteja : హీరోగా చేసినవే కాదు, వాయిస్ తో హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి

రవితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు రవితేజ. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమా రవితేజకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఇకపోతే రవితేజ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పటినుంచి నిన్ను ఒక హీరోని చేస్తాను అంటూ పూరి జగన్నాధ్ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే ఈ మాటలు విన్న రవితేజ నవ్వుకుంటూ ఉండేవాడు. కానీ నిజంగానే పూరి జగన్నాధ్ రవితేజని మంచి హీరోని చేశాడు. రవితేజ కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలు పూరి జగన్నాథ్ ఇచ్చినవే.

ఇకపోతే రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో మిగతా దర్శకులు కథలని అర్థం చేసుకొని కొత్త దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందు ఉంటాడని చెప్పొచ్చు. అయితే బేసిగ్గా కొందరు హీరోలకి నెగిటివ్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. కానీ అందరి హీరోలా ఫ్యాన్స్ కూడా రవితేజను అభిమానిస్తారు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఒకప్పుడు రవితేజ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఉన్నారని చెప్పొచ్చు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత రవితేజకు ఉంది. అయితే రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన బెస్ట్ డైరెక్టర్ అంటే హరీష్ శంకర్ అని చెప్పొచ్చు.

అయితే కొత్త దర్శకులు అంతా కూడా రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చారు. అలానే రవితేజ పరిచయం చేసిన దర్శకులు నేడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇకపోతే కేవలం రవితేజ హిట్ సినిమాలు చేయడమే కాకుండా, రవితేజ వాయిస్ ఓవర్ తో హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు.

మగధీర సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా మర్యాద రామన్న. ఈ సినిమాలు సునీల్ నడిపిన సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ సినిమాకు కూడా వాయిస్ ఓవర్ అందించాడు రవితేజ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో కూడా రవితేజ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. కేవలం తను నటించిన సినిమాలే కాకుండా తన వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కూడా హిట్ అయ్యాయంటూ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు