Hanuman OTT: ఓటిటి రిలీజ్ కు కూడా ప్రమోషన్లా… ఇంత అతి అవసరమా?

సంక్రాంతి విన్నర్ గా నిలిచిన “హనుమాన్” మూవీ ఓటిటి రిలీజ్ గురించి ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే హిందీ వర్షన్ ఓటిటి రిలీజ్ డేట్ ఖరారైంది. మిగతా భాషల్లో “హనుమాన్” ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ నేపథ్యంలో “హనుమాన్” మూవీ ఓటిటి రిలీజ్ విషయంలో మేకర్స్ చేస్తున్న పనులు ఇంత అతి అవసరమా అనిపించేలా చేస్తున్నాయి. ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టడమే ఈ కామెంట్స్ కు కారణం.

“హనుమాన్” హిందీ వెర్షన్ రెడీ..
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజ సజ్జ ప్రధాన పాత్ర పోషించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇంకా ఓటిటిలోకి రాలేదు. అన్ని భాషల ప్రేక్షకులు థియేటర్లలో హనుమాన్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 300 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. హిందీ వెర్షన్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినప్పటికీ మిగతా భాషల్లో మాత్రం ఇంకా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

హనుమాన్ ఓటిటి వర్షన్ కు ప్రమోషన్లు…
సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యే ముందు హీరో హీరోయిన్లతో పాటు చిత్ర బృందం అంతా కలిసి ప్రమోషన్లు చేపడతారు. మూవీ జనాల్లోకి ఎంతగా వెళ్తే అంత మంచి ఫలితం ఉంటుంది. అయితే అందులో కంటెంట్ కూడా ఉండడం ముఖ్యం. తాజాగా హనుమాన్ విషయంలో మాత్రం మేకర్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ ఓటిటి హిందీ వర్షన్ కోసం ప్రమోషన్లు చేయడానికి రెడీ అయ్యారు. హనుమాన్ హిందీలో మార్చ్ 16న రాత్రి 8 గంటలకు కలర్స్ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. అదే తేదీన జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే హిందీ వెర్షన్ ఓటిటి ప్రమోషన్ల కోసం హీరో తేజ ముంబై చేరుకున్నారు. హిందీ వర్షన్ ప్రీమియర్ గురించి పలు వీడియోలు వదిలే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే హనుమాన్ ఓటిటి స్ట్రీమింగ్ గురించి ఎదురు చూసి చూసి విసుగెత్తిపోయిన ఆడియన్స్ వీళ్ళు అతి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆల్రెడీ థియేటర్లలో చూసేసిన సినిమాకు మళ్లీ ఓటిటి స్ట్రీమింగ్ కు ప్రమోషన్స్ ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ మూవీ అప్పుడేదో థియేటర్లు దొరకలేదనే సింపతి కారణంగా హిట్ అయ్యిందని, వీళ్ళు ఇంకా ఇలాగే అతి చేసుకుంటూ వెళ్తే ఓటిటిలో మూవీనీ చూసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా దేశమంతా ఎదురుచూస్తున్న మూవీకి మళ్లీ సపరేట్ గా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

జీ5లో “హనుమాన్” రాక…
కాగా హనుమాన్ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా సరైన అప్డేట్ లేదు. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ త్వరలోనే ఓటిటి వెర్షన్ గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పినప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. మార్చ్ 15న లేదంటే 16న జీ5లో హనుమాన్ అందుబాటులోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు