Family Star : “ఫ్యామిలీ స్టార్” దోశ రచ్చ… ఇదేనా అసలు ట్విస్ట్?

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”ను ట్రోల్స్ వదలట్లేదు. మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఏదో ఒక విధంగా ట్రోలింగ్ కు గురైంది. తాజాగా టీజర్ లో హీరో వేసిన దోశ గురించి రచ్చ మొదలైంది. అయితే ఈ దోశ ట్రోలింగ్ పై స్పందిస్తూ నిర్మాణ సంస్థ ఇచ్చిన సమాధానం చూస్తుంటే అసలు కథ వేరే ఉందేమో అనిపిస్తుంది. మరి ఆ దోశ సీక్రెట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

ఇది మిడిల్ క్లాస్ “దోశ”నా?
విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఫ్యామిలీ స్టార్”. ఈ మూవీలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే “ఫ్యామిలీ స్టార్” మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఏప్రిల్ 5న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న క్యామియో రోల్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే టీజర్ లో విజయ్ దేవరకొండ దోశ వేసే సీన్ ఒకటి మీమ్ రాయుళ్లకు, ట్రోలర్లకు దొరికింది. అందులో విజయ్ దేవరకొండ పెనంపైన దోశ వేస్తాడు. కానీ అభినయ ప్లేట్ లోకి వచ్చేసరికి అది పేపర్ గా మారింది. నిజానికి ముందుగా అందరూ అది దోశ అనుకున్నారు. కానీ కాస్త గమనించాక అది పేపర్ అనే విషయాన్ని గుర్తుపట్టారు. దీంతో ఇది మిడిల్ క్లాస్ దోశనా అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

నిర్మాణ సంస్థ సమాధానం ఇదే…
తాజాగా దోశపై జరుగుతున్న రచ్చ గురించి “ఫ్యామిలీ స్టార్” నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు స్పందించారు. ఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్” మూవీ రిలీజ్ అవుతుందని గుర్తు చేస్తూ, అప్పుడే డౌట్ లన్ని క్లియర్ చేసుకోండి అని రిప్లై ఇచ్చారు. “ఏప్రిల్ 5న అన్ని డౌట్ లను మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో క్లియర్ చేసుకోండి” అని సమాధానం ఇచ్చారు.

- Advertisement -

దోశ వెనకున్న అసలు కథ ఇదేనా?
అయితే వీళ్ళ సమాధానం చూసిన తర్వాత దోశ వెనక ఉన్న కథ వేరే అనిపిస్తోంది. నిజానికి టీజర్ లో కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే చూపిస్తారు. దానికోసం సినిమాలోని కొన్ని హైలెట్ సీన్లను కత్తిరించి యాడ్ చేస్తారు. ఇక్కడ విజయ్ దేవరకొండ దోశ వేసిన సీన్, అభినయ ప్లేట్లో అతను దోశ వేసిన సీన్ డిఫరెంట్ అన్పిస్తోంది. ముఖ్యంగా అభినయతో విజయ్ ఉన్న సీన్లో సైడ్ కి పిల్లలు కనిపిస్తున్నారు. అదికూడా స్కూల్ డ్రెస్ లో. కాబట్టి అది దోశ కాదు… పిల్లల మార్క్స్ షీట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. మరి ఈ దోశ రచ్చ ఏంటో తేలాలి అంటే ఏప్రిల్ 5న థియేటర్లలో “ఫ్యామిలీ స్టార్”ను వీక్షించాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు