Vijay Sethupathi: అలాంటి నిర్ణయం తీసుకున్న విజయ్ సేతుపతి.. అవకాశాలూ వస్తాయా..?

విజయ్ సేతుపతి.. ఒకప్పుడు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత.. తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా అవతారం ఎత్తి అంతకుమించి ఇమేజ్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. మక్కల్ సెల్వన్ అని తమిళ అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన నటుడిగా మారిపోయారు. ముఖ్యంగా హీరోగా మంచి పాత్రలలో నటించి అభిమానులను అలరించారో.. విలనిజంతో కూడా అదే రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు.. తెలుగులో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో జవాన్ సినిమాతో విలన్ గా సత్తా చాటారు. అంతకంటే ముందు తమిళ్ లో కూడా మాస్టర్ , విక్రమ్ వంటి సినిమాలలో తన విలనిజంతో అబ్బురపరిచారు విజయ్ సేతుపతి.. అలా తన విలనిజంతో ఎన్నో సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇకపై ఎలాంటి విలన్ వేషాలు వెయ్యబోనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. కేవలం హీరో కథలను మాత్రమే తీసుకురండి అంటూ దర్శక నిర్మాతలకు ఆర్డర్ కూడా వేస్తున్నారట.. ఇక నేను చేయాలనుకున్న పాత్రలన్నీ కూడా చేసేసాను.. కాబట్టి కేవలం హీరో గానే గట్టిగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను.. అలాంటి కథలు ఉంటేనే చెప్పండి అంటూ తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలకు క్లియర్గా చెబుతున్నారట విజయ్ సేతుపతి..

పాన్ ఇండియా మూవీ రిజెక్ట్..
ఇటీవల నార్త్ రామాయణం సినిమాలో విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేశారట.. ఇంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే ఇంత నిర్లక్ష్యంగా రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు

తొందరపడ్డారా..
ఇకపోతే ఇకపై విలన్ గా ఎటువంటి సినిమాలు చేయనని చెప్పి తొందర పడ్డారా అంటూ అభిమానుల సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి.. మరిన్ని మంచి సినిమాలలో అవకాశాలు అందుకొని భారీ స్టేటస్ సొంతం చేసుకున్న తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే బాగుండేది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే విజయ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అది ఎంతో నిండుగా కనిపిస్తుంది. అయితే హీరోగా కథలను ఎంచుకోవడానికి కూడా ఈయన చాలా సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇకపోతే విలన్ గా సినిమాలు చేయనని చెప్పి హీరో గానే కథలు వింటానని చెబుతున్న విజయ్ సేతుపతి ఏం చేయాలనుకుంటున్నాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. మొత్తానికైతే వచ్చిన పాత్రలను వద్దనుకుంటూ .. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విజయ్ సేతుపతికి హీరో క్యారెక్టర్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు